కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. తాజాగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో సింధు, కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. తొలి గేమ్‌లో 21-15 తో నెగ్గిన సింధు రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో వరుస గేమ్స్‌లో ఆధిపత్యం చెలాయిచి భారత్‌కు మరో పసిడి అందించింది. కాగా కామన్వెల్త్ క్రీడల్లో ఆమెకు ఇతే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. ఈ స్వర్ణంతో 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.













