యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు, లక్ష్యసేన్
యూఎస్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు లక్ష్మసేన్, పీ.వీ.సింధు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ లక్ష్యసేన్ 21-8, 23-21తో జాన్ లూడా (చెక్ రిపబ్లిక్) పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో శంకర్ ముత్తుస్వామి 21-18, 21-23, 21-13తో మిసా జిల్బర్మన్ (ఇజ్రాయెల్)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో అతడు లక్ష్మసేన్ను ఢీకొంటాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ సింధు 21-14, 21-12తో సుంగ్ యున్ (చైనీస్ తైపీ)ని చిత్తుచేసింది. క్వార్టర్స్‌లో ఫాంగ్ జీ (చైనా)తో అమీతుమీ తేల్చుకోనుంది.













