ఫోన్ కాంతితో జాగ్రత్త.. త్వరగా వృద్ధాప్యం!
స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యూబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి విడుదలయ్యే అధిక నీలి కాంతి కారణంగా శరీరం త్వరగా వృద్ధాప్యం బారిన పడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈగలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. ల్యాప్టాప్లు, ఫోన్లు, టీవీలు వంటి పరికరాల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్లో ఎక్కువ సమయం గడపడం వల్ల శరీరంలోని అనేక కణాలపై ప్రభావం పడుతుంది. చర్మం, కొవ్వు కణాల నుంచి ఇంద్రియా న్యూరాన్ల వరకు అనేక దుష్ప్రభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలితంగా శరీరంలో వృద్ధాప్య ప్రక్రియ త్వరగా మొదలవుతుంది అని ఈ అధ్యనానికి నేతృత్వం వహించిన ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాడ్విగా గిబుల్టోవిచ్ తెలిపారు.













