రక్త పిశాచిలా బాడీ బిల్డర్ సారా
మనుషుల రక్తం తాగే రక్త పిశాచాలు ఉన్నాయని ఊహించుకుంటేనే చాలా మంది భయపడతారు. హాలీవుడ్లో రక్త పిశాచాలపై ఎక్కువగా సినిమాలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వచ్చిన ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సాధారణంగా పిశాచాలు పదునైన పెద్ద కోరలు కలిగి ఉంటాయి. తాజాగా అమెరికాలోని నాష్విల్లేకు చెందిన ఓ మహిళా బాడీ బిల్డర్ సారా హోల్డా(34 ఏండ్లు) రక్త పిశాచిలా ఆమె రూపాన్ని మార్చుకున్నది. తన పైదంతాలకు రెండు కోరలను పెట్టుకోవడానికి ఆమె 300 పౌండ్లను వెచ్చింది. ఫాంటసీ/అడ్వెంచర్ మూవీ మేల్ఫిసెంట్లో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీలా తన ముఖంలో మార్పులు చేయించుకున్నది. తనకు రక్తపిశాచులు అంటే చాలా ఆసక్తి అని, వాటి మరణంలేని, బలం, రూపం, మెడను కొరికే విధానం ఇలా ప్రతీది నాకు బాగా నచ్చుతుందని ఆమె చెప్పింది. చిన్నతంలో ఎక్స్-మెన్ వంటి సూపర్ కార్టూన్లు, బ్లేడ్ ఫ్రాంఛైజీ లాంటి రక్త పిశాచి సినిమాలను ఎక్కువగా చూశానని పేర్కొంది.













