అధికారులకు కిమ్ కీలక ఆదేశాలు… భారీగా పెంచండి
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తమ ప్రధాన ఆయుధ కర్మాగారాలను సందర్శించారు. అధునాతన క్షిపణులతో పాటు ఇతర యుద్ధ ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు. యుద్ధానికి సిద్ధం కావాలంటూ ఇటీవల అధికారులకు పిలుపునిచ్చిన కిమ్ ఇప్పుడు ఆయుధాల తయారీకి సంబంధించిన కీలక ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా దక్షిణ కొరియా`అమెరికా దళాలు సంయుక్త సైనిక విన్యాసాలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో కిమ్ ఆయుధ కర్మాగారాల సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉక్రెయిన్`రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆయుధాల విక్రయ నిమిత్తం కిమ్ తాజా ఆదేశాలు జారీ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













