విశ్వ సుందరిగా షెన్నిస్ పలాసియోస్
నికరాగువా భామ షెన్నిస్ పలాసియోస్ నూతన విశ్వసుందరిగా అవతరించారు. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని షెన్నిస్కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ అందాల పోటీలో నికరాగువాకు ఇదే తొలి విజయం. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్-2023 పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. ఈ పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్‌గా కాగా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచారు. మన దేశం తరపున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా శార్దా తొలి 20లో నిలిచారు.













