రాత్రిపూట భోజనం చేస్తున్నారా.. అయితే మీకు
పగటిపూట చేసే భోజనంతో పొలిస్తే రాత్రి తీసుకునే ఆహారం వల్ల మానసిక ఒత్తిడి, కుంగుబాటు సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అకాశముందని అమెరికాలో ఒక అధ్యయనం తేల్చింది. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కొందరు వాలంటీర్లను రెండుగా వర్గీకరించారు. అందులో మొదటి బృందం రాత్రి, పగలు భోజనం చేసింది. రెండో బృందం పూర్తిగా పగటి వేళ మాత్రమే ఆహారం తీసుకుంది. మొదటి బృందంలో అదుర్దా, కుంగుబాటు తరహా భావోద్వేగాలు పెరిగినట్లు వెల్లడైంది. పగటి వేళ భోజనం అనంతరం ఈ భావాలు 16 శాతం, రాత్రి సమయంలో ఆహారం తీసుకున్నాక 26 శాతం మేర ఇవి పెరిగినట్లు తేలింది. పగటి వేళ మాత్రం ఇలాంటి పెరిగినట్లు తేలింది. పగటి వేళ మాత్రం ఇలాంటి పెరుగుదల కనిపించ లేదు. దీన్నిబట్టి భోజన సమయం మానసిక పరిస్థితులపై ప్రభావం చూపుతుందని స్పష్టమవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.













