భారతీయుడు రికార్డు.. ప్రపంచంలో టాప్-10లో
ఆస్ట్రేలియాలో జరిగిన డెలీరియస్ వెస్ట్ ( డబ్ల్యూఈఎస్టీ) మారథన్ విజేతగా సుకాంత్ సుఖి నిలిచాడు. 350 కిలో మీటర్ల దూరాన్ని 102 గంటల 27 నిమిషాల్లో చేరుకున్నాడు. గత నెల 8 నుంచి 12 వరకు ఈ పోటీలు జరిగాయి. ప్రపంచంలో 200 మైళ్లను చేధించిన టాప్-10లో ఒకడిగా సుకాంత్ సుఖిని నిలిచాడు మారథాన్‌లో భాగంగా ఎదుర్కొన్న కష్టాల, సవాళ్ల గురించి తెలియజేస్తూ సుకాంత్ సుఖి యూట్యూబ్‌లో ఒక మీడియో ఉంచాడు. మారథాన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేశాడు. నా జీవితంలో చేసిన అత్యంత కష్టమైనది ఇదే. మిగిలిన జీవిత కాలం మొత్తం ఇది గుర్తు ఉండి పోతుంది అని సుఖి పేర్కొన్నారు. ప్రమాదకరమైన అడవిలో 350 కిలో మీటర్లు పరుగు తీయడం సాధ్యమేనా అని ప్రశ్నించాడు.













