పారాలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం
టోక్యో పారాలింపిక్స్ లో భారత పతకాల పంట పండిస్తోంది. భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఇప్పటికే షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లెఖారా స్వర్ణం సాధించగా.. ఇప్పుడు జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో చేర్చాడు. సుమిత్ అంటిల్ అత్యధికంగా 68.55 మీటర్ల దూరం తన ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. తన ఐదో అటెంప్ట్ లో ఈ ఫీట్ సాధించడం ద్వారా సుమిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సుమిత్ అంటిల్ సాధించిన గోల్డ్ మెడల్తో కలిపి పారాలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు రెండు బంగారు పతకాలు సాధించినట్లయ్యింది. మొత్తం పతకాల సంఖ్య ఏడుకు చేరింది.













