యూఎస్ ఓపెన్ లో సంచలనం
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీలో భాగంగా మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ సంచలనం సృష్టించింది. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన యూఎస్ ఫైనల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించి ట్యూనీషియాకు చెందిన ఆన్స్ జబీర్ను 6-2, 7-6 (7-5) తేడాతో ఓడించి తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.అ లాగే ఈ ట్రోఫీని ముద్దాడిన తొలి పోలండ్ క్రీడాకారిణిగానూ చరిత్ర సృష్టించింది. దీంతో స్వియాటెక్ తన కెరీర్లో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వెసుకుంది. స్వియాటెక్ 2020, 2022లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. 2016 తర్వాత ఒకే సీజన్లో రెండు గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న మొదటి మహిళగా 21 ఏళ్ల స్వియాటెక్ నిలిచింది. ఇగా స్వియాటెక్ కెరీర్లో ఇది 10వ టైటిల్ కావడం విశేషం.













