సెరెనా విలియమ్స్ సంచలన ప్రకటన
అమెరికా నల్లకలువ, 23 గ్రాండ్‌స్లామ్‌ల విన్నర్ అయిన సెరెనా విలియమ్స్ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 9న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన ఈ దిగ్జ క్రీడాకారిణి తన రిటైర్మెంట్ నిర్ణయంపై యూ టర్న్ తీసుకోబోతున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్యర్యపరిచింది. యూఎస్ ఓపెన్ 2022లో తన చివరి మ్యాచ్ అడిన సెరెనా మళ్లీ రంగంలోకి దిగడం ఖాయం అంటూ తాజాగా వెల్లడిరచింది. తన వ్యాపార ప్రమోషన్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సెరెనా మాట్లాడుతూ తాను రిటైర్ కాలేదని, ఆట నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని, ఇప్పటికీ తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నానని రీఎంట్రీపై హింట్ ఇచ్చింది. వచ్చే ఏడాది (2023) ఆస్ట్రేలియా ఓపెన్‌లో పునరాగమనం చేయవచ్చని పరోక్ష సంకేతాలు పంపింది.













