విదేశాల్లో మన విద్యార్థులకు ఆరోగ్య బీమా పాలసీ
విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల కోసం హెచ్డీఎఫ్సీ లైఫ్ నగదు రహిత (క్యాష్‌లెస్) ఆరోగ్య బీమా పాలసీని ఆవిష్కరించింది. ప్రీమియంను అమెరికా డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్న, చదవాలనుకుంటున్న 12-40 ఏళ్ల వయసు విద్యార్థుల కోసం అంతర్జాతీయ విద్యార్థి ఆరోగ్య సంరక్షణ పథకాన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. 3 మిలియన్ డాలర్ల వరకు కవరేజీనిచ్చే ఈ పథకంలో నాలుగు ఆప్షన్లు ఉంటాయని, 3 నెలల నుంచి ఏడాది వరకు వర్తించేలా ఈ పథకం ఉంటుందని తెలిపింది.













