భారత సంతతి బాలికకే స్పెల్ బీ కిరీటం
అమెరికాలో బాలలకు నిర్వహించే ప్రఖ్యాత నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ (14) విజేతగా నిలిచింది. టెక్సాస్‌కు చెందిన హరిణి ప్రస్తుతం ఎనిమిదో గ్రేడ్ చదువుతుంది. పైనల్ ఫోటీలో డెన్వర్‌కు చెందిన విక్రమ్ రాజు (12) పై గెలిచిన హరిణి చాంపియన్‌షిప్ ట్రోఫీ తో పాటు 50 వేల డాలర్ల నగదు బహుమతి అందుకుంది. ఈ పోటీల చరిత్రలో తొలిసారిగా ఫైనల్లో స్పెల్ ఆఫ్ రౌండ్ నిర్వహించారు. నిర్దేశించిన సమయంలోగా ఎవరైతే ఎక్కువ పదాల స్పెల్లింగ్‌లను సరిగ్గా చెబుతారో వారే స్పేల్ ఆఫ్ రౌండ్లో గెలుస్తారు. స్పెల్ ఆఫ్ రౌండ్లో హరిణి 90 సెకన్లలో 26 పదాలకు 22 సరైన సమాధానాలు ఇవ్వగా విక్రమ్ 19 పదాల్లో 15 మాత్రమే చెప్పగలిగాడు. ఇక టెక్సాస్‌కు చెందిన విహాన్ సిబల్, వాషింగ్టన్కు చెందిన ఉప్పాల సహస్ర వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ సారి మొత్తం 209 మంది పోటీపడ్డారు.













