ఈ చేప ధర రూ.72 లక్షలు..

పాకిస్థాన్‍లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని గ్వాదర్ తీరానికి చెందిన మత్స్యకారుడు సాజిద్ హాజీ అబాబాకర్‍దే. ఒకే ఒక చేప పట్టాడు. ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు. అయితే అబాబాకర్ పట్టింది మామూలు చేప కాదు. అరుదైన అట్లాంటిక్ క్రోకర్ జాతికి చెందినది. అందుకే 48 కేజీల బరువైన ఈ చేపకు వేలంలో ఏకంగా రూ.72 లక్షల ధర పలికింది. యూరప్, చైనాల్లో ఈ క్రోకర్ జాతికి అత్యధిక డిమాండ్ ఉంది. చాలా చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయమవుతుంది. క్రోకర్ జాతి చేప విషయం వేరు. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‍లో భారీ డిమాండ్ ఉంది. దీన్ని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన అంశాల్లో వాడతారు. అందుకే దీనికి అంత ధర. నిజానికి వేలంలో ధర ఇంకా ఎక్కువ పలికింది. రూ.86.4 లక్షల వరకు వెళ్లింది. అయితే అంత ధరకు చేజిక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. అందుకే అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు.