గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 31న జరగాల్సిన గ్రామీ అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేసినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మార్చి 14న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గ్రామీ నిర్వాహకులు తెలిపారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ అవార్డులను బహుకరిస్తారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. భారీ సంఖ్యలో కరోనా కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిందని గ్రామీ నిర్వాహకులు ఒక ప్రకటనలో చెప్పారు.













