గూగుల్ బంపర్ ఆఫర్…ప్రతి ఒక్కరికీ లక్షకి పైగా
గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కిందటి వారమే ఆఫీస్ రిటర్న్ పాలసీని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ఊరట ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు అదనపు స్టాఫ్ బోనస్ ప్రకటించింది. కరోనా టైంలో సంస్థ కోసం పని చేస్తున్న తమ ఉద్యోగులందరికీ అండగా నిలిచేందుకు ముందుకొచ్చినట్లు తెలింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆఫీసులలో పని చేసే ఉద్యోగులతో పాటు ఎక్స్టెండ్ వర్క్ ఫోర్స్. ఇంటర్న్స్‌కి కూడా వన్ టైం క్యాష్ బోనస్ గా 1,600 డాలర్లు (మన కరెన్సీలో లక్షా 20 వేల దాకా) అందించనున్నట్లు పేర్కొంది. వర్క్‌ఫ్రమ్ హోం అలవెన్స్ వెల్బీయింగ్ ( సంక్షేమ) బోనస్‌తో పాటు ఈ అదనపు బోనస్ అందించనున్నారు. ఇక ఇందుకోసం ఎంత బడ్జెట్ కేటాయించారనే విషయాన్ని గూగుల్ ప్రతినిధి వెల్లడించలేదు.













