గూగుల్ కీలక నిర్ణయం… వర్క్ ఫ్రం హోంపై
ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే విషయంలో గూగుల్ మధ్యే మార్గాన్ని ఎంచుకుంది. ఒకేసారి ఆఫీసుకు వచ్చి పని చేయడానికి బదులు ఇళ్లు, ఆఫీసుల నుంచి ఉద్యోగులు పని చేసే హైబ్రిడ్ విధానానికి ఓకే చెప్పింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆఫీసు వర్క్స్ ఫై నిర్ణయం తీసుకోనుంది. కోవిడ్ అనంతర పని విధానంపై ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీలు ఏడాదిన్నరగా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నాయి. అయితే సెప్టెంబరు నుంచి ఆఫీసుకు రావాలంటూ గూగుల్ తన ఉద్యోగులను కోరింది.
సుమారు 10,000 మందికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయడంపై స్పందించారు. ఇందులో ఇళ్లు, ఆఫీసుల నుంచి పని చేసే అవకాశం కల్పించాలంటూ 8500 మంది ఉద్యోగులు గూగుల్‌ను కోరారు. వీరిలో కొందరు తమను ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేయాల్సిందిగా అభ్యర్థించారు. కొద్ది మంది వర్క్ ప్లేస్‌లో సౌకర్యాలు, మార్చితేనే ఆఫీస్‌కి వచ్చేందుకు సిద్దమంటూ తెలిపారు. ఉద్యోగుల నుంచి వచ్చన స్పందన ఆధారంగా ఇళ్లు, ఆఫీసుల నుంచి హైబ్రిడ్ పద్ధతిలో పని చేసుకునేందుకు గూగుల్ సుముఖత వ్యక్తం చేసింది. అదే విధంగా ఉద్యోగులు కోరినట్టుగా కొందరిని బదిలీలు చేసేందుకు సైతం అనుకూలంగానే ఉన్నట్టు తెలిపింది.













