జీ మెయిల్ వెబ్సైట్ వెర్షన్‌కు కొత్త అప్డేట్
గూగుల్ సంస్థ జీమెయిల్ వెబ్సైట్ వెర్షన్‌కు కొత్త అప్డేట్ ను ఆచరణలోకి తెస్తోంది. డిజైన్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇదే విషయాన్ని యూజర్లకు తెలియజేస్తోంది. అయితే, కొత్త లుక్ నచ్చపోతే.. యూజర్లు తిరిగి పాత సెట్టింగ్స్‌కు మారిపోయే ఆప్షన్ కూడా ఇస్తున్నట్లు గూగుల్ తెలిపింది. గత జనవరిలో కొత్త జీమెయిల్ లుక్ గురించి గూగుల్ ప్రకటించింది. కాకపోతే స్టాండర్డ్ వైర్షన్ అని, పాతదానికి మారిపోయే ఆప్షన్ ఉండదని పేర్కొది. కానీ ఇప్పుడు మాత్రం నచ్చని వారికి పాత వెర్షన్‌ను కూడా సంస్థ ఆఫర్ చేస్తోంది. కొత్త జీమెయిల్ లుక్‌లో ఎడమ చేతి వైపు రెండు ప్యానెల్స్ ఉంటాయి. వాటిలో ఒక వరుసలో జీమెయిల్, చాట్, మీట్ బటన్స్ కనిపిస్తాయి. మరొక వరుసలో పైన కంపోజ్ పేరుతో పెద్ద బాక్స్, దాని కింద ఇన్ బాక్స్ ఇతర మెయిల్ ఆప్షన్లు కనిపిస్తాయి.













