ఐరాస చీఫ్‌తో జై శంకర్ భేటీ
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌తో విదేశాంగ మంత్రి జై శంకర్ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధం వల్ల అంతర్జాతీయంగా నెలకొంటున్న ప్రభావంపై ముఖ్యంగా ఆహార, ఇంధన భద్రతలపై వారు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. వర్ధమాన దేశాలపై ఈ యుద్ధ పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయని జై శంకర్ పేర్కొన్నారు. అఫ్ఘానిస్తాన్, మయన్మార్‌ల్లో పరిస్థితులపైనా చర్చించినట్లు తెలిపారు. అమెరికాలో పర్యటనలో తర్వాత జై శంకర్ ఐక్యరాజ్య సమితికి వచ్చారు. కీలకమైన సమకాలీన సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుకు భారత్‌తో కలిసి పని చేసేందుకు గుటెరస్ ఆసక్తి చూపారంటూ ఆయనను అభినందించారు.













