24 గంటల్లో 16 సార్లు న్యూ ఇయర్ వేడుకలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు 2024 సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ను 16 సార్లు జరుపుకున్నారు. ఇంటర్నేషనల్ స్పేష్ స్పేషన్ (ఐఎస్ఎస్) రోజుకు 16 సార్లు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ప్రతి 92.9 నిముషాలకు ఒకసారు భూమిని చుట్టొస్తుంది. ఐఎస్ఎస్ లోని వ్యోమగాములకు 12 గంటల పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. భూ భ్రమణంలో భాగంగా వారు 45 నిమిషాల పగలు, 45 నిముషాల రాత్రిని చూస్తారు. దాంతో వారు జనవరి 1న ఒకే రోజు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు వీక్షించారు. ఐఎస్ఎస్ను 15 దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి అక్కడకు వ్యోమగాములు వెల్లి వస్తున్నారు. ఆరు పడక గదుల ఇల్లు పరిమాణంలోని ఈ స్టేషన్లో ఏడుగురు వ్యోమగాములు పనిచేస్తుంటారు.













