ఇది అమెరికా రెచ్చగొట్టే చర్య.. దీనివెనుక
గ్వాంటనామో నౌకా స్థావరం వద్ద కొన్ని రోజుల పాటు అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి తిష్టవేయడాన్ని క్యూబా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రెచ్చగొట్టేందుకే అమెరికా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు అమెరికా జలాంతర్గామని నౌక స్థావరంలో ఉందని క్యూబా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నౌకాస్థావరంలోకి జలాంతర్గామి ప్రవేశాన్ని క్యూబా ప్రభుత్వం తిరస్కరిస్తుందని, ఇది అమెరికా రెచ్చగొట్టే చర్య అని, దీనివెనుకున్న రాజకీయ, వ్యూహాత్మక దురుద్దేశ్యాలు పూర్తిస్థాయిలో వెల్లడికావాల్సివుందని తెలిపింది. క్యూబా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా 121 ఏళ్లుగా గ్యాంటనామో బేలో అమెరికా దురాక్రమణ కొనసాగుతుందని తెలిపింది.













