ట్రంప్ ఆతిథ్యం.. జిన్ పింగ్ దౌత్యం
ఓవైపు ప్రస్తుతం అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా.. మరోవైపు అగ్రరాజ్య రేసులో ఉన్న చైనా.. ఇరుదేశాధినేతల శిఖరాగ్ర సమావేశం అంటే మాటలా..! ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్షణాలవి. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్.. అమెరికాలో ఇటీవల మూడురోజుల పాటు పర్యటించారు. చరిత్రలో చాలా అరుదుగా కనిపించే దృశ్యాలు.. ఈ పర్యటనలో ఆవిష్కృతమయ్యాయి. మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్న షీ జిన్‌పింగ్ దంపతులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఘన స్వాగతం పలికారు. అమెరికా చరిత్రలో ఇలా ఒక విదేశీ నేతకు అధ్యక్షుడే నేరుగా బేస్ వద్దకు వెళ్లి స్వాగతం పలకడం 1962 తర్వాత ఇదే తొలిసారి.
జిన్ పింగ్ దంపతులకు 21 గన్ సెల్యూట్, సైనిక గౌరవ వందనాలతో పాటు వైట్‌హౌస్ రోజ్ గార్డెన్లో ప్రత్యేక సైనిక రివ్యూ నిర్వహించారు. అనంతరం ఇరు దేశాల నేతలు వైట్‌హౌస్‌లో చాయ్ పే చర్చలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాలు వి30 బిలియన్ల విలువైన వస్తువులపై సుంకాలను తగ్గించుకోవడానికి అంగీకరించాయి. అమెరికా నుండి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలతో పాటు చైనా నుంచి వచ్చే కొన్ని కీలక దిగుమతులకు ఇది వర్తిస్తుంది. అలాగే నవంబర్‌లో ముగియాల్సిన వాణిజ్య సంధిని జనవరి వరకు పొడిగించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే నష్టాలు, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య నవంబర్ నుండి ప్రత్యేక సంభాషణలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఏఐ సాంకేతికతను మానవ నియంత్రణలోనే ఉంచాలని, దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని చైనా అధినేత పిలుపునిచ్చారు.భౌగోళిక రాజకీయాలు: ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలు మరియు తైవాన్ సంక్షోభం వంటి అంతర్జాతీయ భద్రతా అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇరాన్‌కు చైనా అందిస్తున్న మద్దతును ట్రంప్ ఆక్షేపించగా, ఇరు దేశాల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం రాకుండా చూసుకోవాలని షీ జిన్‌పింగ్ నొక్కిచెప్పారు.
అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ , వాణిజ్య సంస్థల సీఈఓలు హాజరయ్యారు. ఈ విందులో ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, జెఫ్ బెజోస్, సామ్ ఆల్ట్‌మన్, టిమ్ కుక్, జెన్సన్ హువాంగ్ వంటి దిగ్గజాలు పాల్గొని చైనాతో వాణిజ్య, సాంకేతిక సంబంధాలపై చర్చించారు.సాంస్కృతిక సంబంధాల బలోపేతంలో భాగంగా చైనా తరపున అమెరికాలోని అట్లాంటా జూ కు రెండు కొత్త పాండాలను బహుమతిగా ఇస్తున్నట్లు షీ జిన్‌పింగ్ ప్రకటించారు. అలాగే విద్యార్థుల ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లను కూడా విస్తరించనున్నారు.పర్యటన ముగింపులో భాగంగా జిన్‌పింగ్ దంపతులు అమెరికా జాతీయ ఆర్కైవ్స్‌ను సందర్శించి, అక్కడి చారిత్రక రాజ్యాంగ పత్రాలను పరిశీలించారు.
షీ జిన్ పింగ్ వ్యూహాత్మక దౌత్యం..
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన అమెరికా పర్యటన ద్వారా ..తన దేశానికి అనుకూలంగా వ్యూహాత్మక స్థిరత్వాన్ని కొన్ని స్పష్టమైన ఆర్థిక, దౌత్యపరమైన ప్రయోజనాలను సాధించగలిగారు. ప్రధానంగా చైనా .. అమెరికా దేశాలు..పరస్పరం సుమారు వి30 బిలియన్ల విలువైన వస్తువులపై సుంకాలను తగ్గించుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇది చైనా ఎగుమతిదారులకు , ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చింది. మరింత ప్రధానమైంది.. నవంబర్ 10తో ముగియాల్సిన వాణిజ్య సుంకాల సంధిని జనవరి 10, 2027 వరకు మరో రెండు నెలల పాటు పొడిగించేలా చైనా అమెరికాను ఒప్పించగలిగింది. దీనివల్ల అమెరికాతో మరింత అనుకూలమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చైనాకు అదనపు సమయం లభించింది.
అమెరికా టెక్ దిగ్గజాలతో జిన్‌పింగ్ చర్చలు
అధికారిక విందులో ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, జెఫ్ బెజోస్, సామ్ ఆల్ట్‌మన్ వంటి అమెరికాకు చెందిన అగ్రశ్రేణి టెక్, బిజినెస్ సీఈఓలతో షీ జిన్‌పింగ్ నేరుగా చర్చలు జరిపారు. అమెరికా ప్రభుత్వం చైనాపై ఆంక్షలు విధిస్తున్న తరుణంలోనూ, అమెరికా కార్పొరేట్ రంగానికి చైనా మార్కెట్ ఎంత ముఖ్యమో గుర్తుచేస్తూ, చైనాలో పెట్టుబడులు పెట్టేలా వారి నమ్మకాన్ని పునరుద్ధరించడంలో ఈ భేటీ తోడ్పడింది.
‘సమాన హోదా’ కలిగిన అగ్రరాజ్యంగా గుర్తింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానాశ్రయానికి స్వయంగా వచ్చి స్వాగతం పలకడం, జిన్‌పింగ్‌ను ఒక సమానమైన అంతర్జాతీయ భాగస్వామిగా గౌరవించడం ద్వారా చైనా తన దౌత్యపరమైన పలుకుబడిని ప్రపంచానికి చాటిచెప్పింది. దీంతో ఇన్నాళ్లు అమెరికా అనుసరిస్తున్న వైఖరి.. ఇప్పుడు ట్రంప్ సర్కార్ వైఖరికి మధ్య తేడా ప్రపంచానికి తెలిసివచ్చింది.
గ్లోబల్ సప్లై చైన్
అమెరికా రక్షణ రంగ, హైటెక్ పరిశ్రమలకు అత్యంత కీలకమైన క్రిటికల్ మినరల్స్ (ఖనిజాల) సరఫరాను చైనా కొనసాగిస్తుందని హామీ ఇవ్వడం ద్వారా, అంతర్జాతీయ సరఫరా గొలుసులో (Global Supply Chain) చైనాకున్న తిరుగులేని శక్తిని మరోసారి నిరూపించుకుంది. తర్వాతి సంవత్సరాల్లో అమెరికాతో జరిపే చర్చల్లో ఈ క్రిటికల్ మినరల్స్ చైనాకు మంచి అస్త్రంగా మారే అవకాశముంది. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా సరిహద్దు ఘర్షణలు తలెత్తినప్పుడు ఇరు దేశాల సైన్యాల మధ్య తక్షణ సమాచార మార్పిడి కోసం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికాను.. చైనా అంగీకరింపజేసింది.
కృత్రిమ మేధ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణకు సంబంధించి నవంబర్ నుండి ప్రారంభం కాబోయే చైనా-యూఎస్ ఏఐ డైలాగ్‌లో చైనా కీలక పాత్ర పోషించనుంది. దీని ద్వారా భవిష్యత్ టెక్నాలజీ నిబంధనల రూపకల్పనలో చైనాకు సమాన భాగస్వామ్యం దక్కనున్నాయి. ఈ పర్యటనలో కుదిరిన చారిత్రాత్మక 8-అంశాల ఒప్పందం ప్రకారం, 2026లో చైనాలో జరగబో(ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం) సదస్సుకు మరియు అమెరికాలో జరగబోయే G20 సదస్సుకు ఇరు దేశాలు పరస్పరం మద్దతు ఇచ్చుకోవాలని నిర్ణయించాయి. రాబోయే కొద్ది నెలల్లోనే ట్రంప్-షి జిన్‌పింగ్ మరో రెండు సార్లు భేటీ కావడానికి ఇది మార్గం సుగమం చేసింది.మొత్తంగా చూస్తే, చైనా తనపై అమెరికా విధించాలనుకున్న కఠినమైన ఆర్థిక ఆంక్షల తీవ్రతను తగ్గించుకుంటూనే, ప్రపంచ వేదికపై అమెరికాతో సమానమైన సూపర్ పవర్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగలిగింది.
ట్రంప్ దౌత్యనీతి.. సాధించిన ఫలితాలు..
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన ద్వారా అమెరికా కూడా తన దేశ ప్రయోజనాలకు అనుకూలంగా కొన్ని కీలకమైన ఆర్థిక, రక్షణ మరియు వ్యూహాత్మక లబ్ధిని పొందింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ …తన దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ఈ చర్చలు జరిపినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. చైనాతో కుదిరిన వాణిజ్య సుంకాల తగ్గింపు ఒప్పందం ప్రకారం, అమెరికా నుండి చైనాకు ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులు, కలప మరియు సౌందర్య సాధనాలపై చైనా టారిఫ్‌లను తగ్గించింది. ఇది అమెరికా రైతులకు, పశువుల పెంపకందారులకు భారీ లబ్ధి చేకూరుస్తుందని, వారు దీని పట్ల చాలా సంతోషంగా ఉంటారని ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
30 బిలియన్ల డాలర్ల సుంకాల ఉపశమనం
నాన్-సెన్సిటివ్ విభాగంలోని వి30 బిలియన్ల విలువైన అమెరికన్ వస్తువులకు చైనా మార్కెట్లో అనుకూలమైన వాతావరణం లభించింది. ముఖ్యంగా చైనా మార్కెట్.. అమెరికా కంపెనీలకు మరింత చేరువయ్యే అవకాశముంది.
క్రిటికల్ మినరల్స్ సరఫరా
అమెరికా రక్షణ, టెక్ దిగ్గజాలకు అత్యంత కీలకమైంది రేర్ ఎర్త్ మినరల్స్..ఈ పర్యటన ద్వారా చైనా రకం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (అరుదైన ఖనిజాల) సరఫరాను అమెరికా అంతరాయం లేకుండా పొందగలిగింది. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అగ్రరాజ్యం చూసుకోగలిగింది.వాణిజ్య సంధిని మరో రెండు నెలలు పొడిగించడం ద్వారా ఈ సరఫరా గొలుసు భద్రంగా ఉండేలా అమెరికా లబ్ధి పొందింది.
తైవాన్ సంక్షోభం మరియు దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య ఎలాంటి అనాలోచిత సైనిక ఘర్షణలు జరగకుండా “ఘర్షణలు వద్దు, ముఖాముఖి పోరు వద్దు” అనే కట్టుబాటుకు చైనాను అమెరికా ఒప్పించగలిగింది. అదే సమయంలో చైనా….. అమెరికా ప్రత్యక్ష పరోక్ష జోక్యం వద్దని స్పష్టంగా చెప్పింది.
ట్రంప్ పర్సనల్ డిప్లొమసీ
చైనా అధినేత షీ జిన్ పింగ్.. తనకు మంచి స్నేహితుడని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అంతేనా నేరుగా విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. షీతో వ్యక్తిగత సద్భావనను బలోపేతం చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ భద్రతకు అమెరికా పెద్ద పీట వేసింది. ఆయనకు వైట్ హౌస్ ఆతిథ్యం నుంచి స్వయంగా తీసుకెళ్లి మెరైన్ హెలికాప్టర్ చూపించడం.. ఆయన వ్యక్తిగత ఇష్టాలను తెలుసుకోవడం ద్వారా రిలేషన్స్ మరింత పదిలం చేసుకుంది.
కృత్రిమ మేధ కట్టడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సూపర్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా దూకుడును గమనిస్తున్న అమెరికా, ఈ సాంకేతికత దుర్వినియోగం కాకుండా ఉండేందుకు నవంబర్ నుండి ఉమ్మడి చర్చలు జరపడానికి చైనాను అంగీకరింపజేసింది. అలాగే ఏఐ కి సంబంధించిన అత్యవసర ఘటనలు లేదా ప్రమాదాలు జరిగితే ఇరు దేశాలు తక్షణమే స్పందించేందుకు ఒక ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానల్‌ను అమెరికా సాధించుకోగలిగింది. ఈ పర్యటనలో కుదిరిన 8-అంశాల ఒప్పందం ప్రకారం, అమెరికాలోని మయామిలో జరగబోయే G20 లీడర్స్ సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి చైనా మద్దతు ఇస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ ఆర్థిక వేదికలపై అమెరికా తన నాయకత్వాన్ని మరింత బలంగా ప్రదర్శించడానికి అవకాశం లభించింది.సారాంశంలో, అమెరికా తన సాంకేతిక ఆధిపత్యాన్ని కాపాడుకుంటూనే, తన దేశ రైతులకు ఆర్థిక ప్రయోజనాలను మరియు చైనాతో సైనిక ఘర్షణలు రాకుండా వ్యూహాత్మక భద్రతా హామీలను ఈ పర్యటన ద్వారా లబ్ధిగా పొందింది
తగ్గిన విభేదాలు..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన ఈ భేటీ పైకి ఎంతో ఆత్మీయంగా, “స్నేహగీతం” పాడుతున్నట్లు కనిపించినప్పటికీ, లోపల మాత్రం ఇరు దేశాల మధ్య తీవ్రమైన వ్యూహాత్మక పోటీ, విభేదాలు అలాగే కొనసాగాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఈ పర్యటనను కేవలం ‘పూర్తి స్నేహం’ అనడం కంటే, ‘నియంత్రిత పోటీ’గా చూడటం సముచితం. విమానాశ్రయానికి ట్రంప్ స్వయంగా వెళ్లి స్వాగతం పలకడం, వైట్‌హౌస్‌లో 21 గన్ సెల్యూట్ ఇవ్వడం, ఇద్దరు నేతలు కలిసి రోజ్ గార్డెన్లో నడవడం వంటివి ఇరు దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉన్నాయన్న నమ్మకాన్ని కలిగించాయి. టెక్ సీఈఓలతో కలిసి స్టేట్ డిన్నర్లో పాల్గొనడం, చైనా రెండు సరికొత్త పాండాలను గిఫ్ట్‌గా ఇవ్వడం వంటివి వాతావరణాన్ని చాలా ఆహ్లాదకరంగా మార్చాయి.
ఈ పర్యటనలో స్నేహపూర్వక సంభాషణలు జరిగినప్పటికీ, ప్రధాన వివాదాలపై ఇరు నేతలు తమ పట్టును అస్సలు సడలించలేదు. ముఖ్యంగా ఇరాన్‌కు చైనా అందిస్తున్న మద్దతును, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చైనా అనుసరిస్తున్న వైఖరిని అమెరికా తీవ్రంగా ఆక్షేపించింది. అంతర్జాతీయ భద్రతకు చైనా చర్యలు విఘాతం కలిగిస్తున్నాయని ట్రంప్ గట్టిగానే ప్రస్తావించారు. తైవాన్ విషయంలో చైనా తన సార్వభౌమాధికారాన్ని గట్టిగా సమర్థించుకోగా, ఆ ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని, యథాతథ స్థితిని మార్చడానికి వీల్లేదని అమెరికా హెచ్చరించింది. వాణిజ్య యుద్ధం: వి30 బిలియన్ల సుంకాలను తగ్గించుకున్నప్పటికీ, ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. నవంబర్‌లో ముగియాల్సిన వాణిజ్య సంధిని కేవలం జనవరి 10, 2027 వరకే (రెండు నెలలు) పొడిగించారు. అంటే జనవరి తర్వాత ట్రంప్ ప్రభుత్వం మళ్లీ చైనాపై కఠినమైన టారిఫ్స్ విధించే అవకాశం సజీవంగానే ఉంది.
సెప్టెంబర్ 2026 నాటి వాషింగ్టన్ శిఖరాగ్ర సదస్సు తర్వాత, జనవరి 2027లో ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక వాణిజ్య సంధి గడువు ముగియనుంది. ఆ తర్వాత చైనా-అమెరికా సంబంధాలు ఏ మలుపు తిరగబోతున్నాయనే దానిపై అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మిశ్రమ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. జనవరి 10, 2027 తర్వాత ఇరు దేశాల సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై విశ్లేషకులు ప్రధానంగా మూడు కోణాలను అంచనా వేస్తున్నారు. “పెద్ద ఒప్పందం” లేదా “తీవ్రమైన వాణిజ్య యుద్ధం”.. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగనుంది. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మరియు అమెరికా వాణిజ్య ప్రతినిధి (UST=) జేమీసన్ గ్రీర్ల ప్రకటనల ప్రకారం, చైనా ప్రతినిధులు ఒక సమగ్రమైన, పెద్ద ఆర్థిక ఒప్పందం కోసం ప్రతిపాదనలు తెచ్చారు. జనవరి 2027 లోపు ఈ దిశగా చర్చలు సఫలమైతే ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక వాణిజ్య స్థిరత్వం వస్తుంది.
విశ్లేషకుల ప్రకారం, ఇరు దేశాలూ దౌత్యపరంగా ఒక “నియంత్రిత పోటీ” ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరిస్తున్నాయి. అంటే, విభేదాలు ఉన్నప్పటికీ 2026 నవంబర్‌లో చైనాలో జరగబోయే అపెక్ సదస్సు, డిసెంబర్లో అమెరికాలో జరగబోయే G20 సదస్సుల్లో ట్రంప్, షీ జిన్‌పింగ్ మరోసారి ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ నిరంతర సంభాషణల వల్ల జనవరి 2027 తర్వాత సంబంధాలు క్షీణించినప్పటికీ, అవి నేరుగా సైనిక ఘర్షణకు దారితీయకుండా నాయకుల స్థాయిలో నియంత్రణ ఉంటుందని భావిస్తున్నారు.
8 అంశాల అధికారిక ఒప్పందం
ఇరుదేశాధినేతల శిఖరాగ్రభేటీలో ఏకాభిప్రాయం కుదిరిన 8 అంశాలను అధికారికంగా ప్రకటించాయి. రెండు అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, వ్యూహాత్మక స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా 8 కీలక అంశాలపై ఇరుదేశాధినేతల చర్చలు జరిపారు. వ్యూహాత్మక స్థిరత్వం మరియు పరస్పర గౌరవంఇరు దేశాల మధ్య సంబంధాలను గౌరవం, నిష్పాక్షికత మరియు సమానత్వం ఆధారంగా మరింత నిర్మాణాత్మకమైన, వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన బంధంగా బలోపేతం చేసుకోవడానికి ఇరు నేతలు అంగీకరించారు. 2026 నవంబర్‌లో చైనా (షెంజెన్) లో జరగబోయే APEC సదస్సుకు, అలాగే డిసెంబర్లో అమెరికా (మయామి) లో జరగబోయే G20 లీడర్స్ సమ్మిట్‌కు ఇరు దేశాలు పరస్పరం పూర్తి మద్దతు ఇచ్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు సదస్సులకు ట్రంప్, షీ జిన్‌పింగ్ హాజరవుతామని హామీ ఇచ్చుకున్నారు. సాంకేతిక రంగంలో అత్యంత కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను “సూపర్ ఇంటెలిజెన్స”గా పిలవడానికి ఇరు నేతలు అంగీకరించారు. దీని ద్వారా ఎదురయ్యే నష్టాలు, ప్రయోజనాలపై చర్చించడానికి ‘యూఎస్-చైనా సూపర్ ఇంటెలిజెన్స్ డైలాగ’ను ఏర్పాటు చేశారు. దీని తదుపరి రౌండ్ సమావేశం 2026 నవంబర్‌లో జరగనుంది. ఏఐ ప్రమాదాల కోసం ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానల్సూపర్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సాంకేతికత కారణంగా అనుకోకుండా తలెత్తే అత్యవసర పరిస్థితులు, సైబర్ ప్రమాదాలు లేదా సాంకేతిక వైఫల్యాలను తక్షణమే పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల మధ్య ఒక ప్రత్యేక ద్వైపాక్షిక కమ్యూనికేషన్ ఛానల్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. సరికొత్త బోర్డ్ ఆఫ్ ట్రేడ్ మరియు ఇతర పర్యవేక్షణ యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వాణిజ్య యుద్ధ తీవ్రతను తగ్గించే క్రమంలో భాగంగా, పరస్పరం నాన్-సెన్సిటివ్ కేటగిరీకి చెందిన సుమారు 30 బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులపై సుంకాలను తగ్గించుకోవడానికి చారిత్రాత్మక అంగీకారం కుదిరింది. అలాగే గతంలో కౌలాలంపూర్‌లో జరిగిన ఆర్థిక చర్చల ఫలితాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.మత్తుపదార్థాల అక్రమ రవాణా మరియు అంతర్జాతీయ నేరాల అదుపులో ఇరు దేశాల లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సహకారాన్ని పెంచనున్నారు. ముఖ్యంగా కొత్త సైకోయాక్టివ్ పదార్థాలు మరియు డ్రగ్స్ తయారీకి వాడే రసాయనాల సరఫరాను అడ్డుకోవడంలో ఉమ్మడి చర్యలు చేపట్టనున్నారు. సాంస్కృతిక మరియు ప్రజా సంబంధాల బలోపేతంలో భాగంగా, అమెరికాలోని అట్లాంటా జూకు చైనా నుండి లీజు ప్రాతిపదికన రెండు కొత్త జెయింట్ పాండాలను పంపే ప్రక్రియను అమెరికా అధికారికంగా స్వాగతించింది. ఈ 8 ప్రధాన ఒప్పందాలతో పాటు, సైనిక పరంగా తక్షణ అత్యవసర కమ్యూనికేషన్ మరియు సరిహద్దు ఘర్షణల నివారణకు గాను ఇరు దేశాల మిలిటరీలు త్వరలోనే ఒక ప్రత్యేక అవగాహన ఒప్పందం (వీశీU)పై సంతకాలు చేయడానికి కూడా అంగీకరించాయి.
వాషింగ్టన్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా అమెరికా, చైనా సైన్యాల మధ్య కుదిరిన రక్షణ రంగ సంక్షోభ నివారణ అవగాహన ఒప్పందం ..ఇరు దేశాల మధ్య అనాలోచిత సైనిక ఘర్షణలను నివారించడానికి ఉద్దేశించిన ఒక వ్యూహాత్మక అడుగు. ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం…ఇండో-పసిఫిక్ ప్రాంతంలో (ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి పరిసరాల్లో) ఇరు దేశాల నౌకాదళాలు, వాయుసేనలు ముఖాముఖి తారసపడినప్పుడు, ఏదైనా చిన్న పొరపాటు లేదా తప్పుడు అంచనా పెద్ద యుద్ధానికి దారితీయకుండా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశం. తక్షణ కమ్యూనికేషన్ ద్వారా ఉద్రిక్తతలను అదుపు చేయడం ఈ ఒప్పంద లక్ష్యం. ఇరు దేశాల సైనిక కమాండర్లు మరియు రక్షణ శాఖ ఉన్నతాధికారుల మధ్య అత్యవసర సమయాల్లో వేగంగా మాట్లాడటానికి వీలుగా ఉన్న సంక్షోభ నివారణ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత వేగవంతం మరియు ఆధునీకరణ చేయనున్నారు.
ఇరు సైన్యాల మధ్య కాలానుగుణంగా సాధారణ సంభాషణలు జరపడం ద్వారా క్షేత్రస్థాయి వ్యూహాలపై పరస్పర అవగాహన పెంచుకుంటారు. క్షేత్రస్థాయిలో ఏదైనా ప్రమాదకరమైన ఎన్కౌంటర్ లేదా ఉద్రిక్త పరిస్థితి తలెత్తినప్పుడు:ఏ అధికారులు ఏ ఛానల్ ద్వారా సంప్రదించాలి?సంక్షోభ సంప్రదింపులను ఏయే ఘటనలు యాక్టివేట్ చేస్తాయి?అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను మరియు పద్ధతులను ఈ ఒప్పందంలో పొందుపరచను న్నారు. కేవలం సంప్రదాయ సైనిక ఘర్షణలే కాకుండా, సైనిక రక్షణ రంగంలో వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ సూపర్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కారణంగా తలెత్తే సైబర్ ప్రమాదాలు లేదా అనాలోచిత సైనిక చర్యలను నివారించ డానికి ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఏఐ సంబంధిత అత్యవసర సైనిక ఘటనలను డీల్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కమ్యూనికేషన్ ఛానల్‌ను దీని కింద ఏర్పాటు చేశారు.








