పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి : సీఎం చంద్రబాబు
గాంధీజీ (Gandhiji), లాల్‌బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri) జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంఉనతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ (Viksit Bharat), స్వర్ణాంధ్ర నిర్మాణంలో గాంధీజీ చూపిన బాటలో నడవాలని సూచించారు. నిరాడంబరత, దేశభక్తి, నిజాయతీకి లాల్‌బహదూర్ శాస్త్రి నిలువెత్తు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ ఆయన ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉందని తెలిపారు. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ఆయన చూపిన నాయకత్వం అందరికీ ఆదర్శమన్నారు.








