వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో రూ.40 కోట్ల డీల్ జరిగిందనే అంశంపై ఈడీ(ED) దర్యాప్తు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నలుగురు నిందితులను విచారించింది. అఫ్రూవర్‌గా మారిన దస్తగిరితో పాటు నిందితులు ఎర్రగంగిరెడ్డి(Erra Gangi Reddy), సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ( Uma Shankar Reddy)ని విచారించి పలు అంశాలపై ప్రశ్నించింది. ఈ క్రమంతో తాజాగా అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది.








