సర్ ప్రక్రియను మళ్లీ పొడిగించే అవకాశం లేదు: సుదర్శన్ రెడ్డి
ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు (Notices) ఇచ్చామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) తెలిపారు. వీరిలో 65 లక్షల మంది నోటీసులకు సమాధానం ఇచ్చారని, 54 లక్షల మందిని తుది జాబితాలోకి తీసుకున్నామని వెల్లడించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం (Khairatabad Constituency) లో 80వేల మందికి నోటీసులు ఇచ్చాం. నోటీసులు అందుకున్న వారిలో 20 శాతం మంది సమాధానాలు ఇచ్చారు. నోటీసులు అందిన వారి ఇళ్ల వద్దకే బిఎల్వొ (BLO)లు వెళ్లి సంబంధిత పత్రాలు తీసుకుంటారు. నోటీసులు అందిన కుటుంబ సభ్యులు అందరూ ఉండాల్సిన పని లేదు. ఒక్కరే మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలు ఇస్తే సరిపోతుంది. సర్ (Sir) ప్రక్రియ గడువు మళ్లీ పొడిగించే అవకాశం లేదు అని సుదర్శన్ రెడ్డి తెలిపారు.








