స్మిత్ మచ్చర్ పై కో పైలట్ గొడ్డలితో దాడి చేశాడా..
కాక్‌పిట్‌లో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ దాడి (FlyDubai Pilot Attack) చేసిన ఘటనలో దర్యాప్తు ముమ్మరమైంది. పైలట్‌పై దాడికి కత్తిని వాడినట్లు తొలుత కథనాలు వచ్చాయి. దీంతో పదునైన ఆయుధం కాక్‌పిట్‌లోకి ఎలా వచ్చిందనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు.. దాడికి కత్తి ఉపయోగించలేదని, క్రాష్ యాక్స్ను వాడి ఉంటాడని భావిస్తున్నారు.
పైలట్‌పై దాడి చేసేందుకు కో-పైలట్ బయట నుంచి ఎలాంటి ఆయుధం తేలేదని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. కాక్‌పిట్‌లో ఉండే గొడ్డలి లాంటి పదునైన పరికరంతోనే దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం.. ఈ క్రాష్ యాక్స్ (crash axe or fire axe) పరికరాన్ని విమాన తయారీ సమయంలో ఫ్యాక్టరీలోనే అమర్చుతారు. అత్యవసర భద్రతా పరికరాల్లో ఒకటైన దీనిని ప్రతి వాణిజ్య విమానంలో తప్పనిసరిగా ఉంచుతారు. విమానం కూలిపోయిన సందర్భాల్లో లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తలుపులు జామ్ అయినప్పుడు.. అత్యవసర మార్గం ఏర్పాటు చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. ప్రయాణికులకు కాకుండా పైలట్లు, సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉండేలా భద్రపరుస్తారు. గతంలో దీనిని మెయిన్ క్యాబిన్‌లోనే ఉంచేవారు. కానీ, అమెరికాలో 9/11 ఉగ్రదాడి తర్వాత (ప్రయాణికులకు అందుబాటులో ఉండకుండా) నుంచి భద్రతా కారణాల దృష్ట్యా కాక్‌పిట్‌లోకి మార్చారు.








