ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?
ఫ్లైదుబాయ్ ప్లేన్ ఘటనతో భారతీయ పైలట్ .. కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆయన ధైర్యానికి ప్రపంచమంతా శాల్యూట్ అంటోంది. 174 మంది ప్రాణాలు కాపాడిన ఆయనను.. స్ఫూర్తి ప్రధాతగా ప్రపంచాధినేతలు కొనియాడుతున్నారు. ఇంతకూ ఎవరీ స్మిత్ మచ్చర్.
కెప్టెన్ స్మిత్ మచ్చర్ భారత సంతతికి చెందిన పైలట్. గుజరాతీ మూలాలున్న ఆయన ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతానికి చెందినవారు. విమానయాన రంగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 2022 జూన్‌లో ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు.
అంతకుముందు, స్పైస్‌జెట్‌లో దాదాపు 11 ఏళ్ల పాటు పనిచేశారు. అక్కడ సీనియర్ కమాండర్‌గా, లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇతర పైలట్లకు శిక్షణ ఇచ్చి, వారి సామర్థ్యాన్ని అంచనా వేసే కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఇవి కూడా చదవండి
బోయింగ్ 737 కుటుంబానికి చెందిన 737-800, 737 మ్యాక్స్ 8, 9 మోడల్ విమానాలను నడపడంలో స్మిత్‌కు విశేష అనుభవం ఉంది. ఆయన తన కెరీర్లో సుమారు 9,750 గంటల పాటు విమానాలు నడపగా, అందులో 6,400 గంటలకు పైగా పైలట్-ఇన్-కమాండర్‌గా (ప్రధాన పైలట్) వ్యవహరించారు. వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ కూడా పూర్తి చేశారు.
స్మిత్ చూపిన అసాధారణ ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒక పెద్ద విపత్తును నివారించడంలో ఆయన పాత్ర సామాన్యమైనది కాదని కొనియాడారు. స్మిత్ సాహసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.








