రష్యాకు కిమ్ ?
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యాకు బయల్దేరారు. ఓ ప్రత్యేక రైల్లో ఆయన మాస్కోకు బయలుదేరినట్లు సమాచారం. కిమ్‌కి చెందిన విలాసవంతమైన రైలు ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి రష్యాకు బయలుదేరిందని దక్షిణ కొరియా వెల్లడించింది. దీంతో పుతిన్, కిమ్‌ల మధ్య సమావేశం గురించిన ప్రచారం జరుగుతోంది. రష్యా ఆయుధాలను సమీకరించే ప్రయత్నం చేస్తోందనే సమాచారం ఉంది. అందుకే కిమ్ రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయని అమెరికా నిఘా వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని, క్రెమ్లిన్‌కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని తెలిపాయి. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ తన ప్రత్యేక రైల్లో రష్యాకు బయలుదేరినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని మస్కో అధికారులు కూడా ధ్రువీకరించినట్లు పేర్కొన్నాయి.













