భారత్‍కు యాపిల్ సాయం

భారత్ కరోనా తీవ్ర పరిస్థితులపై టెక్ దిగ్గజం యాపిల్ భారత్‍కు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. కరోనా నివారణకు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలకు విరాళాల రూపంలో తమ సాయం అందిస్తామని కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు మద్దతుగా యాపిల్ విరాళం ఇవ్వనుందని టీమ్ కుక్ ప్రకటించారు. భారత్‍లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడంతో వైద్యులు, కార్మికులు, యాపిల్ కుటుంబంతోపాటు కోవిడ్‍పై పోరాడుతున్న ప్రతి ఒక్కరి గురించి మేం ఆలోచిస్తున్నాం. అయితే ఎంత సాయం చేస్తారు, ఏ రూపంలో దన్నుగా నిలుసారనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వానికే నేరుగా విరాళం అందించడంపై వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.