కెనడాలో మరోసారి విద్వేష ఘటన
హిందూ వ్యతిరేక శక్తులు కెనడాలో మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. ఒంటారియో ప్రావిన్స్‌లోని విండర్స్ నగరంలోని బాప్స్ స్వామినారాయణ ఆలయ గోడపై భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. ఇందుకు పాల్పడ్డవారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీన్ని ఒట్టావాలోని భారత హై కమిషన్ తీవ్రంగా ఖండిరచింది. జనవరిలో సైతం కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్ నగరంలోని గౌరీశంకర్ ఆలయంపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గతేడాది సైతం కెనడాలో ఇలాంటి మూడు ఘటనలు జరిగాయి. కెనాడా గణాంకాల ప్రకారం 2019`2021 మధ్య మత, లింగ, జాతివిద్వేష నేరాలు 72 శాతం పెరిగాయి. కెనడా జనాభాలో 4 శాతమున్న భారతీయుల్లో ఇవి అభద్రతను పెంచుతున్నాయి. ఈ శక్తులను అడ్డుకట్టవేయాలని కెనడా ప్రభుత్వాని భారత్ కోరింది.













