రిషి సునాక్ కు గట్టి దెబ్బ… ఉప ప్రధాని డొమినిక్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు అక్కడ ఎదురు గాలి వీస్తోంది. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. తన మంత్రిత్వశాఖలోని సిబ్బంది పట్ల బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు పూర్తయింది. తాజాగా ఈ నివేదిక ప్రధాని రిషి సునాక్ చేతికి అందిన కొన్ని గంటల్లోనే రాబ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ప్రధాని రిషి సునాక్కు లేఖ రాశారు. ఈ దర్యాప్తును ఓ ప్రమాదకర దృష్టాంతంగా పేర్కొన్న రాబ్, ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. దర్యాప్తులో ఏం తేలినా సరే, మాటకు కట్టుబడి ఉండటమే ముఖ్యమని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇలా కీలక పదవులకు చేసిన వారిలో డొమినిక్ రాబో మూడో వ్యక్తి కావడం గమనార్హం.













