వ్యాక్సిన్ ట్రయల్స్ లో అమెరికా రికార్డు
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో అమెరికా రికార్డు సృష్టించింది. ఒకేసారి 30 వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించింది. ఈ వ్యాక్సిన్‌ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మోడెర్నా ఇంక్ అభివృద్ధి చేసింది. వలంటీర్లకు రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఫలితాలను విశ్లేషించనున్నారు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌తో పాటు చైనా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌లో చాలా తక్కువ మంది వలంటీర్లపైనే ఇప్పటివరకు ప్రయోగాలు నిర్వహించారు. కానీ, అమెరికాలో ఏ సంస్థ తన వ్యాక్సిన్‌ను అమాలన్నా అక్కడ ప్రత్యేకంగా భారీ ఎత్తున ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. దాంతో పలు వ్యాక్సిన్ సంస్థలు భారీ ట్రయల్స్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ ట్రయల్స్‌కు అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే కొవిడ్ 19 ప్రివెన్షన్ నెట్వర్క్ సాయం చేస్తున్నది. ఆగస్టులో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, సెప్టెంబర్‌లో జాన్సన్ అండ్ జాన్సన్, అక్టోబర్‌లో నోవావాక్స్ సంస్థల వ్యాక్సిన్లపై అమెరికాలో తుది క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. వచ్చే వేసవిలో ఫిజర్ ఇంక్ సంస్థ సొంతంగానే 30 వేల మందిపై ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది.






