అది అంతం కాదు.. మనతోనే శాశ్వతంగా
భారత్లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలకు కరోనా సోకినా వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే. కరోనా నుంచి ఉపశమనం లభించాలంటే దీర్ఘకాలం పడుతుందన్నారు. దేశంలోని ప్రజల అలవాట్ల కారణంగా వారి రోగ నిరోధక శక్తి పలువిధాలుగా ఉంటుందని అన్నారు. ఇది కరోనా స్థానికత స్థాయికి కారణం కావచ్చన్నారు. 2022 చివరి నాటికి వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తయితే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముందన్నారు.







