ప్రపంచ దేశాల కన్నా అమెరికాలోనే ఎక్కువ

అమెరికా కరోనా మహమ్మారికి బాగా దెబ్బతింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 18 శాతానిక పైగా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అలాగే మొత్తం మరణాల్లో 15 శాతానికి పైగా అమెరికాలోనే సంభవించాయి. అమెరికాలో కరోనా మరణాలు 8 లక్షలకు చేరుకున్నాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. అమెరికాలో 5 కోట్ల 20 లక్షల కేసులు నమోదు కాగా, మరణాలు 8,00,266కి చేరాయని తెలిపింది. ఈ మరణాల్లో కాలిఫోర్నియా అగ్రస్థానంలో వుంది. మొత్తంగా 75,411 మంది మరణించారు. టెక్సాస్‌లో 74,707, ఫ్లోరిడాలో 62,073, న్యూయార్క్‌లో 58,287 మరణాలు సంభవించాయి. పెన్సిల్వేనియా, జార్జియా, ఇల్లినాయిస్, న్యూజెర్సీ, ఓహియో, మిషిగాన్ రాష్ట్రాల్లో 25 వేల పైచిలుకు మరణాలు సంభవించాయి. ఫిభ్రవరి 22 నాటికి అమెరికాలో కోవిడ్ మరణాలు 5 లక్షలకు చేరుకున్నాయి. జూన్ 15 నాటికి 6 లక్షలకు, అక్టోబర్ 1 నాటికి 6 లక్షలకు చేరుకున్నాయి.