కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబేకు కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన గృహ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు బయటపడడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్లు తేలిందన్నారు. దీంతో హోం ఐసోలేషన్‍కి వెళ్లి వైద్యుల సూచనలు పాటిస్తున్నానన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా క్వారంటైన్‍లో ఉండాలని.. ఎలంటి లక్షణాలు ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.