కరోనా టీకా రెండో డోసు తీసుకున్న కేంద్ర మంత్రి

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ కరోనా టీకా తీసుకున్నారు. ఛండీగఢ్‍లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజిప్‍మర్)లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. మార్చి 1న టీకా మొదటి డోసు తీసుకున్నారు.