ఈ వైరస్ పిల్లలకు మహా డేంజర్

కొత్త రకం కరోనా వైరస్ ‘స్ట్రెయిన్’ పిల్లల్లో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యూరప్‍లోని బ్రిటన్‍లో స్ట్రెయిన్ వైరస్ తీవ్ర రూపం దాల్చగా పిల్లల్లో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వైరాలజీ నిపుణులు గుర్తించారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ ఎక్కువగా పెద్దలపైనే ప్రభావం చూపగా.. కొత్త స్ట్రెయిన్ మార్పు చెంది పిల్లలపై కూడా ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త స్ట్రెయిన్‍తో చిన్నారులకు మహమ్మారి ముప్పు ఎక్కువగా ఉందంటున్నారు. ఈ స్ట్రెయిన్ కరోనా వైరస్ పిల్లల్లో శరీర కణాల్లోకి ప్రవేశించగానే వైరస్‍కు సంబంధించిన మార్పులు మొదలవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. చిన్నారులతో పాటు పెద్దల్లోనూ రోగ నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఈ వైరస్ వల్ల ఎక్కువగా ఉందని వైరాలజీ స్పెషలిస్ట్, వైరస్ అడ్వయిజరీ గ్రూప్ సభ్యుడు వ్యాండీ బార్కలే వెల్లడించారు. ఈ కొత్త రకం వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తోందని.. ఇప్పటి వైరస్ కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.