అమెరికాలో ప్రతి 500 మందిలో… ఒకరు బలి!

అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి 500 మందిలో ఒకరి కన్నా ఎక్కువమందే కోవిడ్‌తో మరణించారని తెలుస్తోంది. గతేడాది జనవరిలో దేశంలో తొలిసారిగా కరోనా వైరస్ బయటపడినప్పటి నుండి ఇప్పటి వరకు 6,85,000 మందికి పైగా మరణించారు. 4.25 కోట్ల కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబరు మధ్య నాటికి ప్రతి వెయ్యిమందిలో ఒకరు మరణించారు. 9 మాసాల తర్వాత, ఈ మరణాల సంఖ్య రెట్టింపు అయింది. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ వారి బంధువో, మిత్రుడో, కుటుంబ సభ్యుడో ఎవరో ఒకరిని ఈ మహ్మారికి కోల్పోయారు. కోవిడ్‌తో వెల్లువెత్తిన రోగులతో అమెరికాలో ఆస్పుత్రులు తీవ్రంగా పోరాటం చేయాల్సి వచ్చిందని సిఎన్‌ఎన్ పేర్కొంది.
40 నుండి 64 ఏళ్ళ మధ్య వయస్సు వారిలో ప్రతి 780 మందిలో ఒకరు మరణించారు. 65`84 అంతకుమించి వయసున్న వారిలో ప్రతి 35 మందిలో ఒకరు మరణించారు. వృద్ధులకు వారిని కంటికి రెప్పలా చూసుకునే వారిని కరోనా నిర్దాక్షిణ్యంగా కాటేసింది. సెప్టెంబర్ 15 నాటికి, నర్సింగ్ హోంల్లో వున్నవారు సిబ్బంది 1,86,000 మంది మరణించారని ఎఎఆర్‌పి నర్సింగ్ హోం డేటా తెలిపింది.