కరోనా వైరస్ కు కొత్త టీకా వచ్చింది…

కరోనా వైరస్ నిర్మూలనకు కొత్త టీకా వచ్చింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ టీకా 89.3 శాతం సమర్థవంతంగా ఉన్నట్లు తేలింది. యూకేలో నిర్వహించిన ట్రయల్స్లో ఆ టీకాను వినియోగించారు. బ్రిటన్‍లో నమోదు అయిన కొత్త వేరియంట్ పట్ల ఆ టీకా పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ ఈ విషయాన్ని స్వాగతించారు. గుడ్ న్యూస్ అన్న ఆయన.. వైద్య నియంత్రణాధికారులు దీనిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. నోవావాక్స్కు చెందిన సుమారు 6 కోట్ల డోసులను బ్రిటన్ నిల్వ చేసింది.
ఈ ఏడాది రెండవ అర్థభాగంలో మరింత హెచ్చు స్థాయిలో డోసులను ఉత్పత్తి చేయనున్నారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెన్‍కా, ఫైజర్- బయోఎన్‍టెక్, మోడెర్నా టీకాలను బ్రిటన్ ఆమోదం తెలిపింది. మూడవ దశ ట్రయల్స్లో నోవావాక్స్ సమర్థత 89.3 శాతం ఉన్నట్లు ఆ కంపెనీ చెప్పింది. 18 నుంచి 84 ఏళ్ల మధ్య ఉన్న 15 వేల మందిపై ట్రయల్స్ జరిగాయి. సౌతాఫ్రికా వేరియంట్ పట్ల కూడా 60 శాతం సమర్థత ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.