అమెరికాలో స్కూలు విద్యార్థులకు కరోనా
అమెరికాలో స్కూళ్లు తెరుచుకోవడంతో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన స్కూళ్లను తెరువాల్సిందేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టం చేశారు. లేకపోతే పన్ను రాయితీలు రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో జులై నుంచి అమెరికా వ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. కాగా జార్జియా, ఇండియానా, మిసిసిప్పీ నగరాల్లోని రద్దీ స్కూళ్లలో తొలి రోజే వందల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించింది. జూలై చివరి రెండు వారాల్లో అమెరికాలో 97 వేలకు పైగా పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా పిల్లల ఆరోగ్య సంస్థలు విడుదల చేసిన నివేదికలో తెలిసింది. మరోవైపు స్కూళ్లు తెరువాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఆ దేశంలోని ఉపాధ్యా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.






