కరోనా బారినపడిన రాజస్థాన్ సీఎం

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్‍గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికి వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడి నుంచే విధులు నిర్వహిస్తానని తెలిపారు. గెహ్లోత్ సతీమణి సునిత కూడా కరోనా వైరస్ సోకింది. రాజస్థాన్‍లోనూ కరోనా ఉధృతి విపరీతంగానే ఉంది. గత కొన్ని రోజులుగా అక్కడ రోజు వారీ కేసులు 10వేల పైనే ఉంటున్నాయి.