అమెరికాలో కరోనా కేసులు… తగ్గుముఖం

అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో దాదాపు 60 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని తెలిపారు. కోవిడ్ 19 ప్రభావంతో అనేక మంది ఇంకా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఎవరైనా నిరాకరిస్తే తగిన జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదే విధంగా ఫైజర్, మోడెర్నా, జాన్సస్ అండ్ జాన్సస్ వ్యాక్సిన్ల 2 కోట్ల డోసులను అమెరికా జూన్ నెలలో ఇతర దేశాలకు పంపిస్తుందని బైడెన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకుండా అమెరికా దీని నుంచి పూర్తిగా బయటపడిందని అనుకోలేమన్నారు.