కొత్తరూపం తెలిసింది…అది ఎన్440కె

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకు నాన్‍స్టాఫ్‍గా పెరిగిపోతుండటంతో అస్సలు ఇప్పుడు వేధిస్తున్న కోవిడ్ వేరియంట్‍పై సైంటిస్టులు దృష్టిసారించి చివరకు కనిపెట్టారు. పలు రకాల మ్యుటేషన్స్ తో కూడిన కోవిడ్-19 వేరియంట్‍ను పరిశోధకులు దేశంలో గుర్తించారు. వైరస్ తీవ్రతను అంచనా వేయడంపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్440కె అనే వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని సైంటిస్టులు గుర్తించారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‍లో నమోదయిన పలు కేసులను విశ్లేషించగా.. దాదాపు 4-5 శాతం జన్యుపరంగా మార్పిడి చెందిన ఎన్440కె అనే వేరియంట్ ను కనుగొన్నారు. ఈ వేరియంట్ ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్రలో కూడా గుర్తించినట్టు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సిసిఎంబి) డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మిశ్రా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రజారవాణా, మాల్స్, పాఠశాలలు, పరిశ్రమలు, గృహ సముదాయాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని డాక్టర్ మిశ్రా తెలిపారు. కొవిడ్ రెండోవేవ్ నేపథ్యంలో సీసీఎంబీ ప్రయోగశాలలోనూ పరీక్షలను రెట్టింపు చేశాం. వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ సంఖ్యనూ పెంచామని మిశ్రా చెప్పారు.