ఇన్ఫోసిస్ కరోనా సహాయం రూ.200కోట్లు

భారత్‍లో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్‍పై పోరాటానికి ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.200 కోట్ల సాయం చేయనున్నట్టు ప్రకటించింది. కొవిడ్‍కు సంబంధించిన చర్యల కోసం ఈ నిధులను కేటాయించనుంది. కొవిడ్ కేర్ ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ కాన్‍సన్‍ట్రేటర్స్, వెంటిలేటర్‍లను సరఫరా చేసేందుకు ఈ నిధులను వినియోగించ నున్నారు. ఇంకా వలస కార్మికులకు రేషన్, లాక్‍డౌన్‍తో అవస్థలు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆర్థిక సహాయం చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఈమేరకు సంస్థ సిఇఒ సలిల్ పరేఖ్ ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు.
గతేడాది పిఎం కేర్స్ ఫండ్‍కు ఇన్ఫోసిస్ 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. ఇక సిటీ కంపెనీ వచ్చే మూడేళ్ల వరకు రూ.200 కోట్ల సాయం అందివ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రి బెడ్లు, డయోగ్నస్టిక్, టెస్టింగ్ సిస్టమ్, వ్యక్తిగత రక్షణ కిట్ల కోసం రూ.75 కోట్లు తక్షణమే అందజేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.