గుడ్ న్యూస్… దేశంలో కరోనా తగ్గుముఖం

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 20,80,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,73,790 పాజిటివ్‍గా తెలింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. దేశంలో 2,84,601 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారిన పడి మరో 3,617 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కు పెరిగాయి. ఇప్పటి వరకు మొత్తం 2,51,78,011 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనాతో 3,22,512 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 22,28,724 క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‍లో 20,89,02,445 మందికి టీకాలు వేసినట్లు తెలిపింది.