కోటి మంది మహమ్మారిని జయించారు

భారత్‍లో కరోనా వైరస్‍ను జయించిన వారి సంఖ్య కోటి మార్కును దాటేసింది. ప్రస్తుతం దేశంలో 1,00,16,859 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. బుధవారం ఒక్కరోజే 19,587 వైరస్ నుంచి కోలుకోగా, ఆ రేటు 96.36 శాతానికి పెరిగిందని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న 9,37,590 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 20,346 మందికి వైరస్ పాజిటివ్‍గా తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,95,278గా ఉంది. ఇక క్రియాశీల్లో కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. దేశంలో ఆ కేసులు సంఖ్య 2,28,083గా ఉండగా, ఆ రేటు 2.19 శాతానికి తగ్గింది. మరోవైపు, గత 13 రోజులుగా మరణాల సంఖ్య 300లకు దిగువనే ఉంటుంది. గడిచిన 24 గంటల్లో 22 మంది కొవిడ్‍కు బలికాగా, మొత్తంగా 1,50,336 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.