భారత్ కు మోడెర్నా టీకాల రాక!

అమెరికా ఫార్మా కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేసిన కోవిడ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) టీకాలు ఈ వారమే భారత్కు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యాక్సిన్లు జులై 15 నాటికి దేశంలోని ఆసుపత్రులకు అందుతాయని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. మోడెర్నా టీకాల దిగుమతికి సిప్లా ఫార్మా సంస్థకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో మోడెర్నా వ్యాక్సిన్కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోదం తెలిపింది.