భారత్ సరికొత్త రికార్డు…ఒక్కరోజే 1.29 కోట్లకు పైగా

కొవిడ్ వ్యాక్సినేషన్‍లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతవారం ఒక్కరోజులోనే కోటిమందికి పైగా టీకాలు వేసి రికార్డు నెలకొల్పగా, తాజాగా ఆ రికార్డును తిరగరాసింది. మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1.28 కోట్ల మందికిపైగా టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటివరకు 65 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. 50 కోట్ల మందికి తొలి డోసు, 15 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.