త్వరలో స్పుత్నిక్-వీ లైట్ : కేంద్రం

దేశంలో వ్యాక్సినేషన్‍ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ లైట్‍ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతుల పక్రియను వేగవంతం చేయాలని రష్యా తయారీ సంస్థ, భారత్‍లోని భాగస్వామ్య కంపెనీలతో సహా నియంత్రణ సంస్థ అధికారులను ఆదేశించింది. వచ్చే రెండు వారాల్లో ఈ టీకాను అనుమతుల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. అనుమతులు మంజూరైతే దేశంలో అందుబాటులోకి రానున్న తొలి సింగిల్ డోస్ టీకా స్పుత్నిక్-వీ లైట్ కానున్నది.