ఫ్లోరిడాలో కరోనా ఉగ్రరూపం…

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో అక్కడ అధిక సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దవాఖానాల్లో ఉన్న కొవిడ్ బాధితుల సంఖ్య 10,207కు పెరిగింది. గత ఏడాది జులై 23న ఆ సంఖ్య 10,170గా ఉంది. ఇప్పటివరకు అదే అత్యధికంగా ఉండేది. తాజా ఉధృతితో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆసుపత్రుల పాలవుతున్నవారికి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గతవారం సగటున రోజుకు 1,525 మంది వయోజనులు, 35 మంది చిన్నారులు కరోనా కారణంగా దవాఖానాల్లో చేరారు. మియామి నగరంలో ఆసుపత్రుల పాలవుతున్న పిల్లల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతోంది. వారిలో ఎక్కువ మందికీ ఐసీయూల్లో చికిత్స అవసరమవుతోంది.